ఇటీవ తమ కుటుంబం కరోనా బారిన పడిందని త్వరలో కోలుకుంటామని చెప్పిన వ్యక్తి టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rjamouli). కొన్నిరోజులు తర్వాత కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఆయన అనుకున్నట్లుగా ప్లాస్మా దానం చేయలేకపోతున్నారు రాజమౌళి. యాంటీ బాడీస్ కోసం డాక్టర్లు తనను పరీక్షించగా తన ఐజీజీ 8.62 మాత్రమే ఉందన్నారు. 15 కంటే ఎక్కువగా ఉన్న వారి నుంచే యాంటీ బాడీస్ సేకరిస్తారని చెప్పడంతో పాటు తాను ఇవ్వకపోవడానికి కారణాన్ని తెలిపారు. Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెద్దన్న, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani), ఆయన తనయుడు కాలభైరవ ఈరోజు యాంటీ బాడీస్ డొనేట్ చేశారని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపారు. కీరవాణి కుటుంబం సైతం కరోనా బారిన పడి కోలుకుంది. దీంతో ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ప్లాస్మా దానం చేసేందుకు కీరవాణి, ఆయన తనయుడు మేము సైతం అంటూ అడుగేశారు. Photos: ఘనంగా గౌతమ్ పుట్టినరోజు వేడుక 
Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ


కరోనా నుంచి కోలుకున్న వారు కచ్చితంగా ప్లాస్మా దానం చేయాలని దర్శకుడు రాజమౌళి పిలుపునిచ్చారు. ఎందుకంటే యాంటీ బాడీలు కేవలం కొంత సమయంలోనే మళ్లీ డెవలప్ అవుతాయని పేర్కొన్నారు. యాంటీ బాడీస్ దానం చేసి వేరే వారి ప్రాణాలు కాపాడిన వాళ్లం అవుతామంటూ ప్లాస్మా దాతల కోసం పిలుపునిచ్చారు. Maoist Ganapathi Surrender: మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగుబాటు యత్నాలు! 
 Good News: మారటోరియం గడువు మరో రెండేళ్లు పొడిగింపు..! 
Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..